ప్రచురణ తేదీ : Nov 16, 2017 10:55 PM IST

అమెరికాలో మరో భారతీయుడి హత్య

పేరుకు పెద్ద దేశమైన సెక్యూరిటీ విషయంలో మాత్రం అమెరికా చాలా సార్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. రోజుకు ఏదో ఒక దోపిడీ అక్కడ జరుగుతోంది. అంతే కాకుండా అక్కడ ఉన్న తుపాకి సంస్కృతి సాధారణ మనుషుల ప్రాణాలను తీస్తోంది. అయితే గత కొంత కాలంగా భారతీయులపై అక్కడ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎదో ఒక ఘటనలో అక్కడ భారతీయులు చనిపోతున్నారు. ఇప్పుడు మరోసారి తుపాకి సంస్కృతికి మరొక భారత యువకుడు బలయ్యాడు.

రీసెంట్ గా కాలిఫోర్నియాల్లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. భారతీయ విద్యార్థి ధరమ్ ప్రీత్ జస్సేర్ (21) ఫ్రెస్నో నగరంలోని ఒక దుకాణంలో పార్ట్ టైమ్ వర్క్ చేస్తున్నాడు. అయితే అతను పని చేస్తోన్న దుకాణం పక్కన మరో నలుగురు దుండగులు గ్యాస్‌ స్టేషన్‌ లో దొంగతననానికి వచ్చారు. అయితే వారిని చూసి భయంతో క్యాష్ కౌంటర్ దగ్గర ధరమ్‌ ప్రీత్‌ దాక్కున్నాడు. అయితే అతన్ని గమనించిన దొంగ గన్ తో కాల్చి చంపేసి అక్కడి నుంచి పరారయ్యారు. మరణించిన ధరమ్‌ ప్రీత్‌ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటన మొత్తం సిసి కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో పోలీసులు హంతకున్ని కనుగొని అరెస్ట్ చేశారు.

Comments