ప్రచురణ తేదీ : Mon, May 21st, 2018

రజిని అసలు పేరుతో నేను నటిస్తున్నందుకు ఆనందంగా వుంది : నటుడు అరవింద్

సూపర్ స్టార్ రజినీకాంత్ కు వున్న క్రేజ్, చరిష్మా ఒకరకంగా ఏ భారతీయ హీరోకి లేదనే చెప్పుకోవాలి. ఒకానొక సమయంలో అమితాబ్ బచ్చన్ సైతం రజిని క్రేజ్ గురించి చెపుతూ, మేము ఆయనతో పోటీ పడలేము అని చెప్పిన సందర్భాలు లేకపోలేవు. ఇటీవల విడుదలయిన రజినీకాంత్ కబాలి చిత్రం పెద్దగా టాక్ రాకపోయినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. అది కేవలం రజినికి మాత్రమే సాధ్యమవుతుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ వైపు శంకర్ తో 2.0 మొదలెట్టిన రజిని కబాలి చిత్ర దర్శకుడు పా రంజిత్ దర్శకత్వ శైలి నచ్చి అతనికి మరొక అవకాశం ఇచ్చారు. వారి కలయికలో వస్తున్న చిత్రమే కాలా. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో విడుదల కానున్న ఏఈ చిత్రంలో ఎవరికి తెలియని ఒక ఆసక్తికర విషయాన్ని ఆ చిత్రంలో ఒక పాత్రలో నటిస్తున్న నటుడు అరవింద్ ఆకాష్ నేడు మీడియా తో పంచుకున్నారు.

ఇదివరకు పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు అరవింద్ ఆకాష్. రజిని గారితో కలిసి నటించడమే ఒక గొప్ప అనుభూతి, అటువంటిది కాలాలో ఆయన అసలు పేరు అయిన శివాజీ రావు గైక్వాడ్ పేరుతో ఒక పొలిసు ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పాడు అరవింద్ కుమార్. ఇప్పటివరకు ఎవరికి ఇంతటి గొప్ప అవకాశం రాలేదని, ఈ అరుదైన అవకాశం తనను వరించినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందని అరవింద్ అన్నారు. ఇకపై భవిష్యత్తులో ఎవరైనా శివాజీ రావు గైక్వాడ్ పేరోతో పాత్ర చేయాలంటే మొదటగా చేసిన నేను అందరికి గుర్తొస్తానని ఉప్పొంగిపోతూ చెపుతున్నారు. కాగా ముంబై లోని ధారావి ప్రాంత ఇతివృత్తంగా సాగే ఈ చిత్రంలో రజిని భార్యగా ఈశ్వరి రావు నటిస్తుండగా, ఇతర పాత్రల్లో సముద్ర ఖని, నానా పాటేకర్ నటిస్తున్నారు….

Comments