ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

కెనడా వీసా పేరుతో హైదరాబాదీకి టోపీ..!

visa
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి గుజరాత్ చెందిన కొందరు వ్యక్తుల చేతిలో మోసపోయాడు. కెనడా వీసా విషయం లో ఈ ఘటన జరిగింది.సంజయ్ గాంధీ నగర్ కు చెందిన సయ్యద్ గౌస్ అనే వ్యక్తి వృత్తి రీత్యా టైలర్. అతడికి క్వికర్ వెబ్ సైట్ ద్వారా పరిచయమైన గుజరాత్ కు చెందిన కొందరు వ్యక్తులు కెనడా వీసా పేరుతో మోసానికి పాల్పడ్డారు. క్వికర్ ద్వారా అతడికి అహమ్మదాబాద్ కు చెందిన ది వీసా హబ్ నిర్వాహకుల వివరాలు తెలిశాయి. దీనితో వారిని గౌస్ సంప్రదించాడు. తనకు కెనడాలో వర్క్ పర్మిట్ వీసా కావాలని కోరాడు.

దీనికి అంగీకారం తెలిపిన నిందితులు రూ 3.8 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అందులో రూ 70 వేలు ఇక్కడ చెల్లించాలని మిగిలిన మొత్తాన్ని కెనాడవెళ్లిన తరువాత చెల్లించాలని తెలిపారు. దీనికి అంగీకారం తెలిపిన గౌస్ తొలుత రూ 10 వేలను నిందితులు తెలిపిన బ్యాంకు ఖాతాలో జమ చేసాడు. తాము పంపిన దరఖాస్తు లో సంతకం చేసి తమకు పంపాలని కోరగా గౌస్ దానిని కొరియర్ ద్వారా అహమ్మదాబాద్ పంపాడు.దానిని అందుకున్న రెండు నెలల్లో వీసా వస్తుందని నమ్మించి రూ 60 వేలను వారి ఖాతాల్లో జమ చేయించుకున్నారు. ఆతరువాత ఎన్ని నెలలు ఎదురు చూసినా గౌస్ కి వీసా మాత్రం వీసా రాలేదు. చివరకు తాను మోసపోయానని నిర్ధారించుకున్న గౌస్ పోలీస్ లను ఆశ్రయించాడు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసిన పోలీస్ లు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Comments