ప్రచురణ తేదీ : Nov 9, 2017 8:31 PM IST

టెర్రరిస్టు అన్నా కూడా..గర్వపడేలా చేసిన ఎన్నారై..!

అమెరికాలో మన సిక్కు వీరుడు చరిత్ర సృష్టించాడు. ప్రత్యర్థులు టెర్రరిస్టు అని విషం కక్కుతున్నా తట్టుకుని నిలబడి జయకేతనం ఎగురవేశాడు. అమెరికాలోని హొబోకెన్ అనే నగరానికి మేయర్ గా అవతరించాడు. వివరాల్లోకి వెళితే.. రవీందర్ ఎస్ భల్లా అనే ఎన్నారై అమెరికాలో మేయర్ గా ఎన్నికయ్యాడు.

భల్లా ప్రత్యర్థులు అతడు టెర్రరిస్టు అంటూ ప్రచారం చేసినా.. తానేంటో నిరూపించుకున్న భల్లా అక్కడి ప్రజల మనసు గెలుచుకున్నాడు. అమెరికాలో ఓ సిక్కు వ్యక్తి మేయర్ కావడం ఇదే తొలిసారి. జాతివిద్వేషకుడని అతడిపై పోస్టర్లు సృష్టించిన ప్రత్యర్థుల కుట్రలని అతడు తట్టుకోవడం విశేషం. మేయర్ గా ఎన్నికైన తరువాత భల్లా హొబోకెన్ నగరవాసులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Comments