ప్రచురణ తేదీ : Mar 30, 2018 6:48 PM IST

హిట్టా లేక ఫట్టా : రామ్ చరణ్ – రంగస్థలం

గత ఏడాది నుండి మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న చిత్రం రంగస్థలం సినిమా
ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫైనల్ గా సుకుమార్ ఏ హడావుడి లేకుండా కూల్ గా సినిమాకు కావలిసినంత సమయం తీసుకొని ఫినిష్ చేశాడు. రామ్ చరణ్ – సమంత జోడిగా కనిపించిన ఈ సినిమాలో జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. ప్రకాష్
రాజ్ కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. అయితే ఈ సినిమా హిట్టా ఫట్టా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రంగస్థలం గ్రామంలో చిట్టిబాబు (రామ్ చరణ్) అనే వ్యక్తికి తన అన్నయ్య
కుమార్ బాబు (ఆది పినిశెట్టి) అంటే చాలా ఇష్టం. చిట్టిబాబుకి వినికిడి లోపం ఉంటుంది. అయితే ప్రెసిడెంట్ (జగపతి బాబు) అక్రమాలను తట్టుకోలేక కుమార్ బాబు ఎదురు తిరగడం. పోటీగా ఎన్నికల్లో నిలబడటం జరుగుతుంది. ఆ తరువాత అన్నయ్య కోసం చిట్టిబాబును అండగా ఉంటాడు. అయితే
సడన్ గా కుమార్ బాబు హత్య జరగడంతో సినిమా ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఈ ప్రధాన కథాంశాన్ని దర్శకుడు సుకుమార్ చాలా బాగా తెరకెక్కించాడనే చెప్పాలి. పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకున్నాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో పాత్రలను ఇంకా హైలెట్ చేసి ఉంటే బావుండేది.
ఫస్ట్ హాఫ్ లో అవసరం లేని సీన్స్ నిడివి ఎక్కువగా ఉండడం కొంచెం సినిమాకు మైనెస్ గా అనిపిస్తుంటాయి. అయితే రామ్ చరణ్ నటన హైలెట్ గా నిలిచింది. సమంత కూడా తన రామలక్ష్మి పాత్రకు న్యాయం చేసింది. ఇక ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి.
అయితే రంగస్థలం సినిమాకు వివిధ వెబ్ సైట్లు ఇచ్చిన రేటింగ్స్ – సోషల్ మీడియాలో అభిమానులు స్పందనలు ఈ విధంగా ఉన్నాయి.

రామ్ చరణ్ రఫ్ఫాడించాడు

Reviewed By 123telugu.com |Rating : 3.5/5

రాంచరణ్ షో

Reviewed By gulte.com |Rating : : 3.5/5

తప్పక చూడవలసిన చిత్రం

Reviewed By chitramala.com |Rating : 3.5/5

‘రంగస్థలం’ లో రాంచరణ్ దుమ్ములేపాడు.

Reviewed By andhraheadlines.com |Rating : 2.75/5


 


Comments