హీరోయిన్లను వేధించిన ప్రొడ్యూసర్..బలవంతంగా శృంగారం

ప్రస్తుత రోజుల్లో తెర వెనుక సినిమా హీరోయిన్లు చాలా వరకు వేధింపులను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరి హీరోయిన్లు ఆ విషయాల్ని గట్టిగా ఎదుర్కొంటుంటే మరి కొందరు దారుణాలకు బలవుతున్నారు. ఈ మధ్య హాలీవుడ్ లో ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ నిర్మాత హార్వే వీన్‌స్టీన్ హీరోయిన్లను ఎంతో వేధించాడని వార్తలు చాలా వస్తున్నాయి. టాప్ హీరోయిన్లు కూడా ఆయన తమని వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. రీసెంట్ గా ది న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక ఈ బడా ప్రొడ్యూసర్ దారుణాలని ఆధారాలతో సహా బయటపెట్టింది.

చాలా మంది హీరోయిన్స్ ని అతడు వేధించాడని బాధిత హీరోయిన్లు మీడియాతో చెప్పుకున్నారు. ముఖ్యంగా ఏంజెలినా జోలీ వంటి స్టార్ హీరోయిన్ ని అతను శృంగారం చేయమని కోరాడట. ఆవిషయాన్ని ఆమెనె చెప్పింది. 1998 లో అతను చాలా వేధించాడని ఆ వెంటనే అతని తో మళ్లీ కలవడానికి ఇష్టపడలేదని ఏంజెలినా చెప్పింది. మరికొంత మంది పాపులర్ హీరోయిన్లను కూడా వచ్చిన కొత్తలో తాకరాని చోట తాకి అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పారు. లియా సెడాక్స్ అనే మరో స్టార్ హీరోయిన్ కూడా వీన్‌స్టీన్ చాలా కామాంధుడిని తనపై కావాలని పడి ముద్దులు పెట్టాలని చూశాడని ఆరోపించింది. అయితే వీన్‌స్టీన్ వారు చెప్పేవన్నీ అబద్ధాలని తనపై కావాలనే ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు

Comments