ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

పైరేసి భూతాన్ని జైల్లో వేయించిన హీరో


ప్రస్తుత రోజుల్లో పైరేసి భూతం సినిమా నిర్మాతలను చాలా ముంచేస్తున్నాయనే చెప్పాలి. టెక్నాలజీ పరంగా ఎంత స్థాయికి పెరిగినా ఇంకా కొందరు అతి తెలివితో పైరేసి చేసి సినిమా కలెక్షన్స్ ని దెబ్బ తీస్తున్నారు. ముఖ్యంగా ఈ తరహా ధోరణి కోలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ విధానాన్ని అడ్డుకోవాలని ఇప్పటివరకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మళ్లీ నెక్స్ట్ సినిమాలకే అదే రిపీట్ అవుతోంది.

ముఖ్యంగా అక్కడి ప్రముఖ పైరసీ గ్రూప్‌ ‘తమిళ్‌ రాకర్స్‌’ అనే వెబ్ సైట్ లో ఎక్కువగా పైరేసి సినిమాలలు కనిపిస్తున్నాయి. విడుదలైన మొదటి షోకే ఆ సైట్ లో సినిమాలు దర్శనం ఇస్తున్నాయి. అయితే ఎట్టకేలకు అక్కడ హీరో విశాల్ ఆ సైట్ ను మూసివేసేందుకు అడుగులు వేశారు. గత మూడేళ్ళుగు ఆ సైట్ ను మూయించడానికే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో విశాల్ ఈ సారి కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పడంతో చెన్నై పోలీసులు ఆ సైట్ అడ్మిన్‌ గౌరి శంకర్‌ను అరెస్ట్‌ చేశారు. అలాగే ఇంకొక ఇద్దరు నిందితులు కూడా ఉన్నారని వారిని కూడా వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments