ప్రచురణ తేదీ : Jan 22, 2017 1:53 PM IST

ఉప్ప‌ల్‌లో మూసీ కాలుష్యం.. ప్ర‌మాదంలో ల‌క్ష‌లాది జ‌నం!

pollustion
కాలుష్యంలో దిల్లీ త‌ర్వాత తెలంగాణ రాజ‌ధాని టాప్‌-10లో చోటు సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ లో కాలుష్యం ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ఉంద‌ని స‌ర్వేలు తేల్చాయి. హైద‌రాబాద్‌లో మూసీ ప‌రీవాహ‌క ప్రాంతంలో ఉన్న బ‌స్తీలన్నీ కాలుష్య కాషారంలో చిక్కుకున్నాయి. ఇక్క‌డ ప్ర‌జ‌లు రోగాలు పాలై దారుణ ప‌రిణామాల్ని ఎదుర్కొనే స‌న్నివేశం క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఉప్ప‌ల్ వంటి ప‌రిస‌రాల్లో మూసీ ప‌రివాహ‌క ప్రాంతం వ‌ల్ల వెద‌జ‌ల్లుతున్న దుర్వాస‌న‌లు, పారిశ్రామిక వ్య‌ర్థాల వ‌ల్ల ల‌క్ష‌ల జ‌నం ప్ర‌మాదంలోకి వెళ్లిపోతున్నారు. వేలాది కుటుంబాలు రోగాల పాల‌య్యే ధైన్యం క‌నిపిస్తోంది. ఇక్క‌డ పారిశ్రామిక వ్య‌ర్థాలు మూసీలోకి వ‌దిలేయ‌డం పెను ప‌రిణామాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఈ ప‌రిస‌రాల్లో పాల ప్యాకెట్లు తాగినా జ‌నం ప్ర‌మాదంలోకి వెళ్లిన‌ట్టేన‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. అనునిత్యం ఇక్క‌డ రాత్రి వేళల్లో దుర్వాస‌న‌లు వెలువ‌డుతూ ఊపిరితిత్తుల రోగాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని స‌ర్వేలో తేల్చారు. ఇక్క‌డ ఆహార ప‌దార్థాల్లోకి సీసం వ‌చ్చి చేరుతోంద‌న్న‌ది ఓ స‌ర్వే.

ఓ అధికారిక స‌ర్వే ప్ర‌కారం… సాధా రణంగా ఒక మిల్లీలీటర్ నీటిలో 0.01 గిగాగ్రామ్(గీగాగ్రామ్ పర్ మిల్లీలీటర్) సీసం ఉండాల్సి ఉండగా కొన్ని ప్రాంతాల్లో సేకరించిన శాంపుల్స్‌లో కాలుష్య స్థాయి 600 శాతానికి పెరిగినట్టు సర్వే ఫలితాల్లో వెల్లడైంది. కాలుష్య శాతాన్ని పరిశీలిస్తే ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. మూ సారాంబాగ్‌లో 0.198 జీజీఎంల్, ఉప్పల్‌లో 0.315జీజిఎంల్ ఉండగా గండిపేట్ ప్రాం తంలో కాస్త తక్కువగా 0.027 జీజీఎంల్ ఉన్నట్టు గుర్తించారు. చౌటుప్పల్ ప్రాంతంలోని నీటి లో 0.61జీజీఎంఎల్ ఉందని, హైదరాబాద్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యా పేట ప్రాంతంలోని మూసీ నీటిలో సీసం స్థాయి 0.496 జీజీఎంఎల్‌కి చేరినట్టు తెలిసింది.

Comments