ప్రచురణ తేదీ : Dec 27, 2016 6:04 PM IST

అతను ఇంట్లో చీర మాత్రమే కట్టుకుంటాడంట

shadepic
ఇంట్లో ఉన్నపుడు తన భర్త మహిళలా ప్రవర్తిస్తున్నాడని, అతని నుండి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని(29) కోర్టుకు వెళ్ళింది. ఆమె భర్త కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. వీరిద్దరూ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు, సంవత్సరం క్రితం బెంగళూరులో వీరి వివాహం జరిగింది. ఇంట్లో తన భర్త వైఖరి భరించలేక ఆమె కోర్టుకు వచ్చింది.

ఆమె మాట్లాడుతూ… మా ఆయన పగలు ఆఫీసుకు వెళ్తాడు. రాత్రి ఇంటికి వచ్చిన తరువాత అతను చీరని ధరిస్తాడని, ఒక మహిళలా ప్రవర్తిస్తాడని ఆమె అంటుంది. మా వివాహం అయ్యి సంవత్సరం అయినా తాము దగ్గర కాలేదని, ఆయన నపుంసకుడు అని ఆమె ఫిర్యాదు చేసింది. పెళ్ళైన మొదటి రోజు నుండి అతను ఇలానే ఉన్నాడని, అసహజమైన శృంగారాన్ని అతను కోరుకుంటాడని, అతని వైఖరిని తాను భరించలేక పోతున్నానని ఆమె చెప్పింది. అందుకే తనకు తన భర్త నుండి విడాకులు ఇప్పించాల్సిందిగా కోరుతున్నానని ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె నుండి విడిపోయేందుకు ఆమె భర్త కూడా అంగీకరించాడు.

Comments