ప్రచురణ తేదీ : Oct 12, 2018 11:35 AM IST

నయనతార దారిలోనే హన్సిక ?

ఈ మధ్య హీరోయిన్స్ తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, నయనతార, త్రిష, లాంటి హీరోయిన్స్ లేడి ఓరియెంటెడ్ సినిమాతో సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో గ్లామర్ భామ హన్సిక కూడా అదే ప్రయత్నాల్లో ఉంది. తెలుగు తెరపై హీరోయిన్ గా పరిచయం అయినా ఈ అమ్మడు ప్రస్తుతం కోలీవుడ్ లోనే సెటిల్ అయింది. తాజాగా హన్సిక మేహ అనే టైటిల్ తో తెరకెక్కే లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. జమీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమా హన్సికకు 50 వ సినిమా . అందుకే ప్రత్యేకంగా ఉండేలా ఈ స్క్రిప్ట్ ని ఎంపిక చేసుకున్నట్టుంది. ఇప్పటీకే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా దసరాకు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి మేహ సినిమాతో హన్సిక ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

Comments