ప్రచురణ తేదీ : Jan 22, 2017 9:48 PM IST

కిట్టు కోసం ఘాటు రేపుతున్న .. ఐటెం పాప !!

hamsa-nandini
ఈ మధ్య గ్లామర్ భామ కాజల్, లక్ష్మి రాయ్ లు చేసిన ఐటెం సాంగ్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. పైగా ఆ పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయడానికి హీరోయిన్స్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక ఇప్పటికే హాట్ హాట్ అందాలు ఆరబోసి ఐటెం గర్ల్ గా టాప్ క్రేజ్ తెచ్చుకున్న హంస నందిని క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలుసు. లేటెస్ట్ గా ఈ అమ్మడు కిట్టు కోసం హాట్ గా అందాలు ఆరబోసేందుకు రెడీ అయింది? ఇంతకి కిట్టు ఎవరనే గా మీ డౌట్ !! రాజ్ తరుణ్ హీరోగా ”కిట్టు ఉన్నాడు జాగ్రత్త” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హంస నందిని ఐటెం సాంగ్ చేస్తుంది. నిజానికి ఈ సాంగ్ ను హాట్ యాంకర్ రష్మీ కి వచ్చింది .. కానీ రష్మీ ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఆ ఛాన్స్ హంసకు దక్కింది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఈ ఐటెం సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు . సాంగ్ కూడా మంచి ఊపుమీద వచ్చిందని టాక్. మరి హంస రెచ్చిపోయి అందాలు ఆరబోసిన ఈ సాంగ్ పై మీరు ఓ లుక్ వేయండి?

Comments