ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

ట్రైలర్ టాక్ – గుంటూరోడు

guntorodu
సినిమాల్లో కి వచ్చిన అనతి కాలం లోనే తనకంటూ స్పెషల్ సబ్జెక్ట్ ల టేస్ట్ ఉంది అని నిరూపించుకున్నాడు హీరో మంచు మనోజ్. గుంటూరోడు అంటూ ఇప్పుడు కొత్త జోనర్ లో ఊర మాస్ గా రాబోతున్నాడు ఈ హీరో. సంక్రాంతి సందర్భంగా ఈ ట్రైలర్ ని విడుదల చేసారు మేకర్స్ . టీజర్ లో కేవలం యాక్షన్ ఎలిమెంట్ లని చూపించిన డైరెక్టర్ ఈ సినిమాతో ఫుల్ రీల్ చూపించేసాడు. కామెడీ టైమింగ్ లో తను ఎంత పర్ఫెక్ట్ అనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మనోజ్. ‘ప్రయత్నిస్తే పోయేది ఏముందండి.. బ్యాచిలర్ బానిస శృంఖలాలు తప్ప’ అంటూ ప్రగ్యాతో చేసిన కామెడీ బాగానే పండింది. అప్పటివరకూ కామెడీగా నడిపిన ట్రైలర్ ను విలన్ ఇంట్రడక్షన్ ను యాంగిల్ మార్చేశారు. ‘మొగుడినైనా మేనేజ్ చేయచ్చు కానీ.. రంకుమొగుడిని మేనేజ్ చేయడం చాలా కష్టమయ్యా’ అంటూ కోటతో చెప్పించిన డైలాగ్.. ‘సత్తా ఉన్నోడిని చూస్తే చావుకు కూడా పడిపోద్ది నా కొ..కా’ అంటూ మనోజ్ పేల్చే పవర్ ఫుల్ పంచ్.. ‘ఈడు మరీ తీటగాడిలా ఉన్నాడు.. భయం భక్తీ ఎక్కడా మచ్చుకు కూడా కనబడట్లా’ అంటూ ట్రైలర్ చివర్లో వినిపించే డైలాగ్.. గుంటూరోడు ఎంత ఊర మాస్ గా ఉంటాడో చెబుతున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి మంచు ఫ్యాన్స్ కి మంచి మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు మనోజ్.

Comments