ప్రచురణ తేదీ : Dec 27, 2016 11:48 AM IST

శాతకర్ణి లో బుర్ర కథ చెప్పబోతున్న సూపర్ స్టార్ :

gauthami-putra-shatakarni
నందమూరి బాలకృష్ణ 100 వ సినిమాగా గౌతమీ పుత్ర శాతకర్ణి కి చాలా స్పెషాలిటీ లు ఉన్నాయి. క్రిష్ డైరెక్షన్ లో 17 వ శతాబ్దం నాటి కథ అమరావతి ని రాజధాని గా చేసుకుని అఖండ భారతాన్ని ఏలిన చరిత్ర కారుడు శాతకర్ణి గురించి ఈ చిత్రం ఉండబోతోంది. ఈ సినిమాకి అద్భుతమైన గ్రాఫిక్స్ గొప్ప ఆయుధం కాబోతున్నాయి. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో బుర్ర కథ చెప్పడానికి ఒచ్చే ఒక వ్యక్తిగా శివరాజ్ కుమార్ కనిపిస్తారు. ఈ బుర్ర కథ సీన్ సినిమాకే హై లైట్ గా మారబోతోంది అంటున్నారు. తనే ఓ పెద్ద హీరో అయినా.. కథ కోసం.. సినిమా కోసం.. కేవలం ఓ పాటలో నటించేందుకు నటించిన శివరాజ్ కుమార్ ను అభినందించాల్సిందే. అయితే.. ఈపాట చిత్రీకరించిన తీరు.. అందులో ఆయన నటనలతో కూడా మేకింగ్ వీడియో చూస్తే.. ఈ పాత్రకు శివరాజ్ కుమార్ ఏ స్థాయిలో న్యాయం చేశారో అర్ధమవుతుంది

Comments