ప్రచురణ తేదీ : Fri, Nov 25th, 2016

నాలుగేళ్ల క్రితం పారిపోయిన ప్రియుడు .. నోట్ల రద్దు వలన దొరికాడు , ఎలాగో మీరే చూడండి

chennai-atm
విధి ఎంత చిత్రమైనది అంటే ఇలనాటి పర్యవసానాలని చూస్తే అర్ధం అవుతుంది. అనుకున్న దాన్ని మార్చడం ఎవరివల్లా కాదు అనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఒక atm దగ్గర డబ్బులు డ్రా చేసుకోవడం కోసం చాలా మంది లైన్ లో నుంచున్నారు. అందులో ఈ వ్యక్తి కూడా నుంచున్నాడు. ఇంతలో అక్కడికి అతను నాలుగేళ్ల క్రితం ప్రేమించి మోసం చేసి వదిలేసిన ఒక అమ్మాయి అక్కడకి వచ్చంది. లైన్లో నిలుచున్న తన మాజీ ప్రియుడిని గుర్తుపట్టిన యువతి… లైన్లో నుంచి అతడిని బయటకు లాగి చితగ్గొట్టింది. అంతేకాదు, పోలీసులను అక్కడకు పిలిపించి కటకటాల వెనక్కి నెట్టించింది. నాలుగేళ్ల క్రితం ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని… ఆ తర్వాత కనిపించకుండా పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, అతడిపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. మహారాష్ట్ర లోని నాసిక్ లో ఈ సంఘటన జరిగింది.

Comments