ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

బాలయ్య సినిమా టికెట్ ఖరీదు ఎంతో తెలుసా….?

gautamiputrasatakarini
నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్లో 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను స్వంతంగా నిర్మిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ సినిమాను కేవలం మూడు నెలల్లో క్వాలిటీ ఏ మాత్రం తగ్గకుండా పూర్తి చేసాడు క్రిష్. బాలకృష్ణ కూడా క్రిష్ కు సహకరించి ఈ సినిమా బాగా రావడానికి సహకరించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ప్రీమియర్ షోలను పూర్తి చేసుకుని విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో వేసిన ప్రివ్యూ షోకు హీరో బాలకృష్ణ, దర్శకులు క్రిష్, రాజమౌళి, కొరటాల శివ లాంటి వాళ్ళు హాజరయ్యారు.

అక్కడకి బాలయ్య సినిమా చూడడానికి వస్తున్నారని తెలుసుకున్న బాలయ్య అభిమానులు థియేటర్ దగ్గరకు చేరుకొని హడావుడి చేశారు. బాలకృష్ణతో కలిసి సినిమా చూడడానికి గోపీచంద్ అనే ఒక అభిమాని ఒక టికెట్ కోసం ఏకంగా 1,00,100 రూపాయలు పెట్టి కొన్నాడు. ఈ సందర్భంగా గోపిచాంద్ మాట్లాడుతూ.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళం ఇచ్చేందుకు 1,00,100 రూపాయలు పెట్టి టికెట్ కొన్నట్లు చెప్పాడు. మొత్తానికి నటసింహం బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఇకముందు ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Comments