ప్రచురణ తేదీ : Sat, Mar 10th, 2018

ఇకనుండి మీ రైల్వే టికెట్టును ట్రాన్స్ ఫర్ చేస్కొండి ఇలా..!

రైల్వే వ్యవస్థ మొదలైనప్పటి నుండి ఆ సంస్థ ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రయోగాత్మకమైన అభివృద్ధి చేస్తూనే వచ్చింది. అయితే దూరపు ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ చేయించుకుని ఒక్కోసారి ఆ సమయానికి ఏదో పనిపడి ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తే ఆ టికెట్ వృథా అయినట్టే. ఇలాంటి సమయాల్లో దీనికో వేరే ప్రత్యామ్నాయం దొరికితే చాలా బహుంటుంది కదా! ఇప్పుడు అటువంటి సమస్యలకు చెక్ పెట్టడానికి భారత రైల్వేశాఖ ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చింది. అనుకోకుండా వచ్చిన సమస్యల వాళ్ళ రద్దైన ప్రయాణికుల రిజర్వుడు టికట్లను ఇతరులకు బదిలీ చేయవచ్చు అవకాశం కల్పించింది ర్హారత రైల్వే సంస్థ.

నిబంధనలు…

ఒక వేళ టికెట్‌ రిజర్వు చేసుకున్న ప్రయాణికులు ప్రభుత్వోద్యోగులయితే రైలు బయల్దేరడానికి నిర్దేశించిన 24గంటల్లోపు తమ టికెట్‌ను వేరే ప్రయాణికుడి పేరు మీదకు మార్చమన్నట్లు లిఖితపూర్వకంగా లేఖరాసి ఇవ్వాల్సి ఉంటుంది. లేనిచో ఆ టికెట్టు చెల్లదు.
ఇక సాధారణ ప్రయాణికులకు సైతం ఇలాంటి నిబంధనే ఉంటుంది. కాకపోతే ప్రయాణికుడి కుటుంబ సభ్యులకు అంటే అమ్మానాన్నలకు, భార్య, సోదరులు, అక్కాచెల్లెల్లు, భర్త, కొడుకు, కుమార్తెలకు ఈ నియమం వర్తిస్తుంది. వేరే ఇతతులకు ఈ నియమాలు వర్తించవు. రైలు బయల్దేరడానికి 24గంటలలోపు ప్రయాణికులు ఈమేరకు అభ్యర్థన పెట్టుకోవాల్సి ఉంటుంది.

ప్రయాణికులు ప్రభుత్వ గుర్తింపు కలిగిన విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులయితే… వారు టికెట్‌ను బదిలీ చేసుకోదలిస్తే సంబంధిత విద్యాసంస్థల అధికారి సంతకం కావాల్సి ఉంటుంది. రైలు బయల్దేరే 48గంటల్లోపు ఈ మేరకు సంతకంతో కూడిన అభ్యర్థను సమర్పించాల్సి ఉంటుంది.

ఎన్‌సీసీ బృందానికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. కాకపోతే వీరి బృందంలోని నాయకుడి సంతకం కావాల్సి ఉంటుంది. అయితే మొత్తం బృందంలో 10శాతం సభ్యులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. అంతకు మించిన అభ్యర్థనలను తిరస్కరిస్తారు. ఉదాహరణకు మొత్తం బృందంలో 20మంది ఉంటే వారిలో ఇద్దరికి మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుంది. ఈ నిభందనలు పాటించిన అభ్యర్తులకు మాత్రమే టికట్లు బదిలీ చేసుకునే అవకాశం కల్పించనుంది భారతీయ రైల్వే సంస్థ.

Comments