ప్రచురణ తేదీ : Fri, Nov 3rd, 2017

ఫోర్బ్స్ మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ లేడీ ఎవ‌రో తెలుసా?

ప్ర‌తియేటా ఫోర్బ్స్ మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ విమెన్స్ జాబితా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టిలానే 2017 జాబితా వెలువ‌రించింది ఫోర్బ్స్‌. ఈ జాబితాలో టాప్ -100లో చోటు ద‌క్కించుకుంది పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా. అయితే త‌న‌ని ప్ర‌ఖ్యాత ఫోర్బ్స్ ఆ రేంజులో అంద‌లం ఎక్కించ‌డానికి కార‌ణం ఏమై ఉంటంది?

ఇంకేం ఉంది.. హాలీవుడ్ సినిమాల్లో ఆరంగేట్రం.. క్వాంటికో సిరీస్‌తో వ‌చ్చిన ఐడెంటిటీ.. దాంతో పాటు దాన‌, సేవాగుణం.. ప‌లు స్వచ్ఛంద కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకోవ‌డం ఇవ‌న్నీ పీసీని ఆ స్థాయిలో నిల‌బెట్టాయిట‌.
ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితా-2017లో పీసీ 97వ స్థానంలో నిలిచింది పీసీ పీసీకి అంత‌కంత‌కు ఆదరణ పెరిగిందని ఫోర్బ్స్ ఈ సంద‌ర్భంగా తెలిపింది. ఇక ఫోర్బ్స్ టాప్‌-100 జాబితాలో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్ నంబ‌ర్ -1 స్థానంలో నిలిచారు. బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే, బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహ వ్యవస్థాపకురాలు మిలిందా గేట్స్ ఆ తర్వాతి స్థానాలు ద‌క్కించుకున్నారు. ఇండియా త‌ర‌పున‌ చందా కొచ్చర్‌, రోషిణీ నడార్‌ మల్హోత్రా, కిరణ్‌ మజుందార్‌ షా, శోభనా భార్టియా టాప్ -100 జాబితాలో చోటు ద‌క్కించుకున్నారు. అయితే ఈ జాబితాలో ఇత‌ర బాలీవుడ్ నాయిక‌లెవ‌రూ లేక‌పోవ‌డం విశేషం.

Comments