ప్రచురణ తేదీ : Dec 1, 2017 12:44 AM IST

వీడియో : గ్రౌండ్ లోనే అభిమానుల గొడవ

ప్రస్తుత రోజుల్లో కొందరు అభిమానులు ఆవేశానికి లోనై ప్రవర్తించే తీరు చాలా భయంకరంగా ఉంటోంది. ఏదైనా ఒక లిమిట్ వరకు ఉంటె సరదాగా ఉంటుంది. కానీ ఆ సరదా దాటితే మాత్రం పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేరు. అయితే ఎక్కువగా స్టేడియంలో అభిమానుల మధ్య వివాదాలు చెలరేగుతుంటాయి. రీసెంట్ గా అదే తరహాలో పూణేలోని శ్రీ శివ్‌ ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ లో రెండు జట్ల అభిమానుల మధ్యన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఇండియాలో ఫుట్ బాల్ ఫీవర్ మొదలైంది. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ సందర్బంగా ముంబై-పూణే జట్ల మధ్య మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. అయితే అనుకోకుండా కొందరు అభిమానులు తీవ్రంగా దూషించుకుంటూ వివాదానికి దిగారు. కొద్దిసేపటి వరకు జరిగిన ఈ గొడవను ఎట్టకేలకు పోలీసులు వచ్చి కొంతమందిని వేర్ చోటీకు పంపించారు. అయితే గొడవకు సంబందించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Comments