ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

ఐఫోన్ రూపంలో వస్తున్న గన్… యూరోపియన్ పోలిసుల గుండెల్లో దడ

i-phone
రోజురోజుకూ టెక్నాలజీ పెరిగిపోతుంది. దాంతోపాటే టెక్నాలజీని ఉపయోగించుకుని చేసే నేరాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నేరాలను అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు యూరోపియన్ పోలీసులకు కొత్త సమస్య వచ్చి పడింది. చూడడానికి అచ్చం ఐఫోన్ లాగే ఉంటుంది కానీ, దానిని తెరిస్తే అది డబల్ బ్యారెల్ గన్ అయిపోతుంది. చూసేందుకు ఐఫోన్ లా కనిపించే ఈ 9ఎంఎం గన్ అక్కడి పోలీసులకు నిద్రలేకుండా చేస్తుంది. అమెరికాలో అమ్మకాలు మొదలైతే అక్కడినుండి అక్రమంగా యూరోపియన్ మార్కెట్లోకి కూడా వస్తాయని అక్కడి నిఘా అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే ఈ ఐఫోన్ కోసం 12 వేల ఫ్రీ ఆర్డర్లు వచ్చాయి. కేవలం ఒక బటన్ నొక్కితే ఇది తెరచుకుని ట్రిగ్గర్ బయటపడుతుంది. దీంతో ఎడాపెడా కాల్పులు జరపవచ్చు. అది కూడా డబల్ బ్యారెల్ కావడంతో దానిని ఉపయోగించే వాళ్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ధర కూడా 28వేల లోపు ఉండడంతో యూరోపియన్ నేరగాళ్లు తక్కువ సమయంలోనే దీనిని పొందగలరని భావిస్తున్నారు. ఈ గన్ గురించి ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. ఇప్పటివరకు యూరోపియన్ లో కనిపించకపోయినా అది రావడానికి ఎంతో కలం పట్టకపోవచ్చని అంటున్నారు. మాములుగా చూస్తే దీనిని ఐఫోన్ కాదని ఎవరూ అనలేరని చాలామంది దగ్గర ఐఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఉండడంతో అందరినీ చెక్ చేయడం కష్టమని అంటున్నారు.

Comments