ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి చంపిన మేనమామ

baby-killed
చిత్తూరు జిల్లా తిరుచానూరులో పట్టపగలే లక్ష్మిప్రియ (5) అనే బాలిక సోమవారం కిడ్నాపైన కొన్ని గంటల్లోనే దారుణంగా హత్యకు గురైంది. హంతకుడు స్వయాన మేనమామే. ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న ఆస్తితగాదాలే కారణమని తెలుస్తోంది.వికృతమాల గ్రామ చెరువులో చిన్నారి మృతదేహం లభ్యమైంది.

తిరుచానూరుకు చెందిన పెంచల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డిలు ఇద్దరూ సమీప బంధువులు. శ్రీనివాసులు రెడ్డి.. లక్ష్మీప్రియ వరుసకు మేనమామ అవుతారు. లక్ష్మీప్రియ ఎల్ కేజీ చదువుతోంది. అయితే చిన్నపాటి ఆర్థిక లావాదేవీల విషయంలో ఇటీవలే పెంచల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డిల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈనేపథ్యంలో తనకు రావాల్సిన డబ్బులను ఇవ్వలేదన్న కోపంతో శ్రీనివాసులు రెడ్డి పెంచల్ రెడ్డి రెడ్డి కూతరు లక్ష్మీప్రియను బైక్ పై తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి.. వికృతమాల గ్రామ చెరువులో పూడ్చిపెట్టాడు. అయితే లక్ష్మీప్రియ మృతదేహాన్ని అధికారులు ఇంకా బయటకు తీయలేదు. ఎమ్మార్వో సమక్షంలో చిన్నారి మృతదేహాన్ని తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Comments