ప్రచురణ తేదీ : Tue, Sep 12th, 2017

ద‌స‌రా కానుక‌ : ఐదో ఆటగా చిన్న సినిమా డిక్టేర్డ్‌..

తెలంగాణ సినిమాకు ముందే ద‌స‌రా కానుక అందింది. తెలంగాణ సంస్కృతిని ప‌రిర‌క్షించే సినిమా ఇంకా అంప‌శ‌య్య మీద‌నే ఉన్న ఈ రాష్ట్రంలో .. సినిమా రూపు రేఖ‌లు మార్చే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మైన సంగ‌తి తెలిసిందే. ఇక చిన్న సినిమాకి పెద్ద ప‌ట్టంగ‌ట్టాల‌న్న నివేద‌న సీఎం కేసీఆర్ చెంత ఉంది. ఆ మేర‌కు చిన్న సినిమాకి పెద్ద పీట వేస్తూ స‌చివాల‌య స‌మావేశం అనంత‌రం సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని చేసిన ప్ర‌క‌ట‌న‌కు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఈ ద‌స‌రా నుంచి ఐదో ఆట‌గా చిన్న సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు త‌ల‌సాని. అలాగే అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఫిలిం స్టూడియో ఏర్పాటుకు అబ్దుల్లాపూర్ మెట్, కోహెడ ప్రాంతాలలో పర్య‌టించ‌నున్నామ‌ని తెలిపారు. బ‌స్టాండుల్లో థియేట‌ర్ల ఏర్పాటున‌కు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని త‌ల‌సాని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ఎప్ప‌టినుంచో చెబుతున్న సింగిల్ విండో విధానం ఆన్‌లైన్ లైన్‌లోనే షూటింగుల‌కు అనుమ‌తులు మంజూరు చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. యేటేటా బాల‌ల చ‌ల‌న‌చిత్రోత్స‌వాల‌కు 8 కోట్ల మేర విడుద‌ల చేయ‌నున్నామ‌ని వెల్ల‌డించారు.

Comments