ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

బాలీవుడ్ అందాల భామ పై మండి పడుతున్న నెటిజన్లు..!

parineeti-chopra
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా నెటిజెన్ల ఆగ్రహానికి గురవుతోంది. దీనికి కారణం ఈమె సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వీడియోనే. ప్రస్తుతం ఈ భామ ‘మేరీ ప్యారి బిందు’ అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. ఆ సమయంలో ఆమె తీసిన ఓ వీడియో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. పరిణీతి బీచ్ లో ఎక్కడకు వెళితే అక్కడ ఆమె వెంట గొడుగు పట్టుకుని తిరుగుతూ అసిస్టెంట్ కనిపించాడు.ఆమెకు ఎండ తగలకుండా అసిస్టెంట్ ఆమె వెంటనే తిరుగుతున్నాడు.

కాగా అతడు మూడు బ్యాగులు కూడా మోస్తున్నాడు. అందులో ఒకటి పరిణీతి హ్యాండ్ బ్యాగ్. ఓ వైపు బ్యాగ్ లు మోస్తూ కూడా ఆమె వెంటే గొడుగుపెట్టుకుని తిరుగుతున్న అతడి పరిస్థితి నెటిజన్లకు పరిణితి పై ఆగ్రహం కలిగించేలా చేశాయి.గతంలో కూడా పరిణీతి లావుగా ఉన్న తన స్నేహితురాలిని ఎగతాళి చేస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసి ఇలాగే విమర్శలపాలైంది. పరిణీతి కి నీతులు చెప్పడమే కానీ ఆచరించడం తెలియదని నెటిజన్లు మండిపడుతున్నారు.పరిణీతి వెంట తిరిగేది కో యాక్టరా అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.

Comments