ప్రచురణ తేదీ : Dec 30, 2016 7:25 PM IST

ఏనుగుల ఆప్యాయత మనసులు కదిలించింది..!

elephant
భారీ ఆకారం ఉన్నా ఏనుగులు మనుషులకు సేవలు చేస్తూంటాయి. తన యజమానికోసం కష్టపడుతూంటాయి. కానీ మనిషి మాత్రం వాటి అవసరం తీరాక నిర్ధాక్షిణ్యంగా తరలిస్తూంటాడు.వాటికీ కూడా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయని ఈ ఒక్క ఫోటో తెలియజేస్తుంది. ఓ వ్యక్తి తన ఏనుగులను రెండు వేరు వేరు ప్రాంతాలకు తరలించాడు. రెండువేఱువేఱు ట్రక్కుల్లో ఉన్న ఈ ఏనుగులు మార్గ మద్యం లో వాటి తొండాలను పెనవేసుకున్న దృశ్యం అందరి హృదయాలను కదిలించింది.

మనసులను కదిలించేలా ఉన్న ఈ ఫోటోని బెంగుళూరు కు చెందిన సౌమ్య సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
తన యజమానులకు ఈ రెండు ఏనుగులు రెండు వేరు గమ్యాలకు బయలు డేరాయని ఆమె పోస్ట్ చేసారు. ఈ ఫోటోపై అందరూ కామెంట్లు చేస్తూ షేర్ చేస్తున్నారు. జంతువులను బలవంతంగా తరలించడాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటే మరికొందరు మాత్రం ఈ దృశ్యం తమ హృదయాలను కదిలించిందని కామెంట్లు పెడుతున్నారు.

Comments