ప్రచురణ తేదీ : Fri, Apr 27th, 2018

చరణ్ సినిమాలో… ఈగ సుదీప్ ?


ఈగ సినిమాతో టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న సుదీప్ ఆ తరువాత బాహుబలి సినిమాలోనూ మంచి అవకాశం పట్టేసాడు. కన్నడలో సూపర్ స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్న సుదీప్ తాజాగా మరో క్రేజీ తెలుగు సినిమాలో నటించనున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించేందుకు ఓకే చెప్పాడు. ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రెండో షెడ్యూల్ మొదలైన ఈ సినిమా హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. సుదీప్ పాత్ర సినిమాకే కీ రోల్ అని తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన ఖైదా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.

Comments