ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

ఇకనుండి అక్కడ డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ చాలా అందంగా రాయాలంట…!

doctors
మనం ఏదైనా ఆసుపత్రికి వెళ్తే అక్కడి డాక్టర్లు మందుల చీటీ రాసి ఇందులో రాసిన మందులు వాడమని చెప్తారు. వాళ్ళు రాసిన మందుల చీటీని పరిశీలిస్తే ఎంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళైనా కళ్ళు తేలేయాల్సిందే. అందులో ఒక్క అక్షరం కూడా అర్ధం కాదు. డాక్టర్లు ఏం రాసారన్నది కేవలం మందుల షాప్ వాళ్లకు తప్ప ఇంకెవరికీ అర్ధం కాదు. కొన్నిసార్లు మందుల షాప్ వాళ్ళు అందులో ఉన్న మందులు లేకపోతే దానికి సంబందించిన వేరొక మందులు ఇస్తారు. పోనీ మనం చీటీలో రాసిన మందులూ, వాళ్ళు ఇచ్చిన మందులూ ఒకటో కాదో చెక్ చేసుకుందామంటే మనకి అర్ధమై చావదు.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కోర్ట్ ఒక సంచలన తీర్పు వెలువరించింది. డాక్టర్లు ఏటవాలుగా, అర్ధం కాకుండా కలిపిరాత రాయకూడదని డిప్యూటీ అటార్నీ జనరల్ మోక్లేసూర్ రెహమాన్ తీర్పు చెప్పారు. మందుల చీటీ రోగులకు అర్థమయ్యేలా ఉండాలని ఆదేశించింది. కోర్ట్ తీర్పును బట్టి అక్కడి డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ టైపు చేసైనా ఇవ్వాలి, లేదంటే విడివిడి అక్షరాల్లో అర్ధమయ్యేట్టు రాసి అయినా ఇవ్వాలని ఈ తీర్పులో స్పష్టంగా చెప్పింది. ఈ తీర్పుపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ హర్షం ప్రకటించారు. ఈ తీర్పుపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి విశేష ప్రశంసలు అందుతున్నాయి.

Comments