ప్రచురణ తేదీ : Sep 27, 2017 6:32 PM IST

వీడియో తో దొరికిపోయిన అలనాటి హీరో, హీరోయిన్

అప్పట్లో ప్రేమలో మునిగి తెలరని వార్తలు వచ్చాయి. కానీ వాటిని కొట్టి పారేశారు. ఒకటి రెండు సార్లు సినిమాలను చేస్తే ప్రేమ అంటారు అని కూడా అన్నారు. బాలీవుడ్ కి చెందిన సీనియర్ హీరో హీరోయిన్ గతంలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. కానీ చాలా కలం తర్వాత మళ్లీ కెమెరా కంటపడి అందరికి తెలిసిపోయేలా చేసుకున్నారు. వారు ఎవరో కాదు బాలీవుడ్ స్టార్స్ సన్నీడియోల్, డింపుల్ కపాడియా.

80,90 లలో ఓ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ తారలు కొన్ని సినిమాల్లో కలిసి చేశారు. వారు జోడిగా తెరకెక్కిన సినిమాలు మంచి హిట్ అయ్యాయి. అయితే వారి మధ్య అప్పుడే ఎదో నడుస్తుందని గాసిప్స్ వచ్చాయి. ఆ తర్వాత డింపుల్ రాజేష్ ఖన్నాని పెళ్లి చేసుకుంది. సన్నీ కూడా వేరొక మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే మళ్లీ చాలా రోజుల తర్వాత లండన్ విధుల్లో వీరిద్దరూ కలిసి తీరిగుతున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకు సంబందించిన ఒక వీడియోను బాలీవుడ్ క్రిటిక్ కెఆర్కే లీక్ చేశాడు. దీంతో బాలీవుడ్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా పలు రకాల కామెంట్స్ తో నెటిజన్స్ రచ్చ చేస్తున్నారు.

Comments