ప్రచురణ తేదీ : Sep 29, 2017 12:36 PM IST

రోబో దర్శకుడితో దిల్ రాజు భారీ సినిమా

తమిళ దర్శకుడు శంకర్ ఎప్పటి నుంచో కమల్ హాసన్ తో ఒక సినిమాను తియ్యాలని అనుకుంటున్నారు. అప్పట్లో వీరి కలయికలో వచ్చిన భారతీయుడు సినిమా సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత శంకర్ భారతీయుడు సీక్వెల్ తీయబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ అది ఒక రూమర్ గానే ఎండ్ అయ్యింది. ప్రస్తుతం శంకర్ రజినీకాంత్ 2.0 సినిమా తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా విడుదల తర్వాత కమల్ హాసన్ తో సినిమాను తెరకెక్కించనున్నాడడని సమాచారం. అయితే ఆ సినిమాను టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు నిర్మించబోతున్నాడట. ప్రస్తుతం వరుస విజయాలతో దిల్ రాజు దూసుకుపోతున్నారు. గత కొంత కాలంగా ఆయన తీసిన సినిమాలన్ని బాక్స్ ఆఫీస్ హిట్స్ గా నిలుస్తున్నాయి. అయితే ఆయన త్వరలో ఈ భారతీయుడు కాంబినేషన్ లో వచ్చే సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని సమాచారం.

Comments