ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

ఖైదీ కోసం దిల్ రాజు త్యాగం చేశాడా ?

dil-raju
అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150 వ సినిమా ”ఖైదీ నంబర్ 150” ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు త్యాగం చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటారా .. దిల్ రాజు భారీ కాన్ఫిడెంట్ గా తీసిన ”శతమానం భవతి” సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నాడు. తన సినిమా .. ఎలాగూ నైజం ఏరియా ఆయనదే కాబట్టి .. శతమానం భవతి కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలనే ప్లాన్ చేసాడు, అయితే మెగాస్టార్ సినిమా కావడంతో .. అల్లు అరవింద్ కోరిక మేరకు కొన్ని థియేటర్స్ ని తన సినిమాకోసం పెట్టుకున్న కొన్ని థియేటర్స్ ని చిరంజీవి సినిమా కోసం త్యాగం చేసాడట? ఈ రోజు ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన ఖైదీ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

Comments