కేవలం పేరు మాత్రమే తెలుసు..అయినా నిందితుడి భరతం పట్టిన పోలీసులు !

unknown
డిసెంబర్ 29 న ఓ అమ్మాయి ఢిల్లీలో అత్యాచారానికి గురైంది. ఈ కేసులో పోలీస్ లకు ఎలాంటి ఆధారాలు తెలియవు.త్యాచారానికి గురైన మహిళ జనవరి 3 న స్పృహ లోకి వచ్చింది. అఘాయిత్యానికి పాల్పడిన వారిగురించి తనకు ఎలాంటి ఆధారాలు తెలియవని పోలీస్ లకు ఆమె తెలిపింది.తనపై అత్యాచారం చేసిన వారిలో ఒక వ్యక్తి పేరు మింటూ అని మాత్రం తెలిపింది. దీనితో పోలీస్ లు గాలింపు మొదలుపెట్టారు. విహార్ ఫేజ్ – 1 ప్రాంతంలో బాధితురాలు ఉంటోంది.ఆ ప్రాంతంలోనే మింటూ అనే పేరుగల 24 మందిని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. కానీ వారిలో తనపై అత్యాచారం జరిపిన వారు లేరని మహిళ తెలిపింది.

ఈ నేపథ్యంలో ఎవరైనా కేసుని మూసేయడానికి చూస్తారు. కానీ ఢిల్లీ పోలీస్ లు అలా అనుకోలేదు. పోలీస్ లు నిందితుడి కోసం గాలింపు జరుపుతున్న ప్రాంతంలోనే ఓ చైన్ స్నాచింగ్ బృందం వారి కంట పడింది. దీనితో వారిని విచారించగా వారిలో ఒకవ్యక్తి పేరు మింటూ అని తేలింది. మహిళ పై అత్యాచారం చేసిన నిందితులలో అతడు కూడా ఒకడు కావడంతో పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు.

Comments