ప్రచురణ తేదీ : Sat, Jan 28th, 2017

కోర్టులో సల్మాన్ కి 65 ప్రశ్నలు

salman
కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ మెడకి ఇంకా ఆ ఉచ్చు చిక్కుకునే ఉంది. రాజస్థాన్ లోని జోద్ పూర్ కోర్టులో అతనికి వింత ప్రశ్నలు ఎదురు అయ్యాయి. సాధారణంగా కోర్టులో విచారణకు ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా సల్మాన్ స్పందిస్తూ, తాను హిందువునని, ముస్లింనని, ఓ భారతీయుడినని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తొలుత హిందీలో సమాధానం చెప్పిన సల్మాన్… ఆ తర్వాత ఇంగ్లీషులో కూడా చెప్పాడు. మరోవైపు తనపై తప్పుడు అభియోగాలు మోపారని కోర్టుకు తెలిపాడు. తప్పుడు కేసు పెట్టారని ఆరోపించాడు. మొత్తం 65 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తన సహనటుల సమక్షంలోనే సల్మాన్ సాక్ష్యాన్ని నమోదు చేశారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో, సల్మాన్ ఖాన్ రెండు జింకలను చంపాడనే ఆరోపణలతో… 1998లో ఆయనపై కేసు నమోదైంది.

Comments