ప్రచురణ తేదీ : Dec 5, 2017 6:21 PM IST

జనాల కోసమే ఆ పని చేస్తున్నా..హాట్ బాంబ్ రాఖీ..!

శృంగార తారగా పాపులారిటీ పొందిన రాఖి సావంత్ కు వివాదాలు కొత్త కాదు. పేరుకు శృంగార తారే అయినా ఈమె ఒక ఫైర్ బ్రాండ్ లేడి. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా చెప్పేస్తుంది. ఇటీవల సన్నీ లియోన్ కు ఎదురైనా సమస్య రాఖి సావంత్ కూడా ఎదురైంది. కండోమ్ యాడ్ విషయంలో రాఖి సావంత్ కాంట్రవర్సీలో ఇరుక్కుంది.

కండోమ్ యాడ్ లో నటించడంతో రాఖిపై పలు విమర్శలు వస్తున్నాయి. తనపై వస్తున్న విమర్శలకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది ఈ బాలీవుడ్ హాటీ. తాను సిగ్గు పడేంత పని చేయలేదని సమర్ధించుకుంటోంది. సమాజం కోసమే తాను ఈ యాడ్ లో నటించానని పేర్కొంది. ఇప్పటికి మన దేశంలో కండోమ్ గురించి సరైన అవగాహన జనాల్లో లేదని, వారిలో అవగాహన కల్పించడం అవసరం అని పేర్కొంది. రాఖీ వివరణ ఇలా ఉన్నా.. కండోమ్ అమ్మకాలకు కేవలం మహిళల్ని మాత్రమే ఉపయోంచుకోవడం ఏంటని విమర్శ కారులు అంటున్నారు.

Comments