ప్రచురణ తేదీ : Wed, Oct 11th, 2017

స్నేహితుల కోసం కాన్వాయ్ ని ఆపేసిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో వ్యక్తిగతంగానూ అంతే పేరును తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో కీలకపాత్ర పోషించిన ఆయన అప్పట్లో చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక కూడా కేసీఆర్ తన స్వభావాన్ని ఏ మాత్రం మర్చుకోలేదు. అయన ఏ స్థాయికి ఎదిగినా కూడా తన చిన్న నాటి బాల్య మిత్రులను ఏ మాత్రం మర్చిపోలేదు.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాల వేడుకల కోసం సిద్ధిపేట పర్యటనకు వెళ్లిన కేసీఆర్ అక్కడ తన చిన్ననాటి బాల్య మిత్రులను కలుసుకున్నారు. ములుగు వద్ద జాతీయ రహదారిపై తన కాన్వాయ్ ని ఆపిన కేసీఆర్ అక్కడ సాధారణంగా నిలబడి ఉన్న జహంగీర్‌, అంజిరెడ్డిలను కలిశారు. అంతే కాకుండా తన కారులోనే కేసీఆర్ సిద్ధిపేట పర్యటనకు తీసుకువెళ్లారు. అయితే స్నేహితులను గుర్తుపట్టి మరి వెంట తీసుకెళ్లడం చుసిన అందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి కేసీఆర్ ఎంత మంచివారో అని మాట్లాడుకున్నారు.

Comments