ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

థియేటర్ కి వచ్చిన చిరంజీవి తల్లి

chiru-mother
దేశానికి రాజు అయినా కూడా ఒక తల్లికి కొడుకే కదా మరి.. కొడుకు ఎంతటి వాడు అయినా తల్లికి అతను ఇంకా చిన్న పిల్లడు మాత్రమే . మరి మెగా స్టార్ గారి తల్లి తన కొడుకు ఖైదీ 150 సినిమా గురించి ఏం ఆలోచిస్తున్నారు ? ఆమె ఈ సినిమా చూస్తున్నారా ? ఇలాంటి బోలెడు సందేహాలు లేస్తున్నాయి. అభిమానులకే కాదు ఆమెకి కూడా ఆయనే మరి అభిమాన హీరో అంటోంది ఆమె. సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత 60 సంవత్సరాలు దాటిన తర్వాత కుర్రాడిలా చెలరేగిపోతుంటే ఆ అమ్మ ఇంట్లో ఉండలేకపోయారు. అందరి అభిమానుల్లాగానే మొదటి రోజు మొదటి షో కి అంత రష్ పరిస్థితుల్లోనూ వెళ్లారు!
గతంలో ఎన్నడూ లేనట్లుగా మెగాస్టార్ తల్లి “ఖైదీ” ని చూసేందుకు స్వయంగా థియేటర్ కు తరలివచ్చారు. హైదరాబాద్ – ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటరులో చిరంజీవి తల్లి అంజనాదేవి ఈ సినిమాను చూశారు. ఈ సమయంలో అంజనాదేవి తో పాటు చిరు సతీమణి సురేఖ – వీరితో పాటు హీరో అల్లు అర్జున్ దంపతులు కూడా ఆమెతోపాటు వచ్చారు. దీంతో “బాస్ ఈజ్ బ్యాక్” – “స్టైలిష్ స్టార్” అంటూ అభిమానులు కేరింతలు – నినాదాలతో వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులు చేసిన నినాదాలతో సంథ్య థియేటర్ ప్రాంగణం దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. ఈ సమయంలో చిరు కుటుంబాన్ని థియేటర్ లోకి పంపేందుకు పోలీసులు – బౌన్సర్లు నానా ఇబ్బందులూ పడాల్సి వచ్చింది.

Comments