ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

అప్పట్లో చిరంజీవి, రోజా ముసుగు కప్పుకుని రెస్టారెంట్ కు వెళ్ళారంట…!

roja-chiranjeevi
చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టిన తరువాత ఆయన అభిమానులు, సన్నిహితులు కొంతమందికి ఆయన శత్రువులుగా మారారు. తన తోటి నటులకు కూడా రాజకీయ పరంగా శత్రువు అయ్యారు. అలాంటి వారిలో చిరంజీవి పక్కన మూడు సినిమాలలో హీరోయిన్ గా చేసిన ప్రముఖ నటి రోజా ముందువరుసలో ఉంటారు. రాజకీయంగా చిరును ఆమె చాలాసార్లు చాలా ఘాటైన పదజాలంతో విమర్శించింది. అయితే ఇప్పుడు చిరంజీవి రాజకీయాలను పెద్దగా పట్టించుకోకుండా మళ్ళీ సినిమాలపై దృష్టి పెట్టడంతో ఆయన రాజకీయ ప్రత్యర్ధులు అందరూ ఒక్కొక్కరుగా మళ్ళీ చిరంజీవి తో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే రోజా కూడా రాజకీయంగా ఉన్న శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఒక ఛానల్ కోసం చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు ఇద్దరూ కలిసి నటించినప్పటి సంగతులను కూడా గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా రోజా అప్పట్లో జరిగిన ఒక సంఘటనను చిరంజీవికి గుర్తు చేసింది. గతంలో ఒకసారి సురేఖతో కలిసి మనం ముసుగు వేసుకుని ప్యారడైజ్ హోటల్ కు వెళ్లి బిర్యానీ తిన్న సంగతి గుర్తుందా అని చిరంజీవిని ప్రశ్నించింది. దాంతో చిరంజీవి కూడా నవ్వుతూ గుర్తుందని చెప్పారు. ఈ ఇంటర్వ్యూ చుసిన చాలామందికి రోజాకు చిరంజీవికి మధ్య విభేదాలు తొలగిపోయాయని భావిస్తున్నారు.

Comments