ప్రచురణ తేదీ : Jan 27, 2017 12:40 PM IST

మీలో ఎవరు ?? వెయిటింగ్ ….

chiru
ఖైదీ 150 టీజర్ టైం నుంచే వెయిటింగ్ అనే వర్డ్ బాగా ఫేమస్ అయిపొయింది. బయట కూడా ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కడైనా ఇతర ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వెయిటింగ్ అంటూ చిరంజీవి స్టైల్ లో అనడం పరిపాటి. ఆ సినిమా ఇంటర్వెల్ సీన్ లో వచ్చే ఈ డైలాగ్ విలన్ కి గుబులు పుట్టిస్తే ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించింది. ఇప్పుడు అదే డైలాగ్ ను చిరు.. తన బుల్లితెర షో కోసం ఉపయోగించిన తీరు చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే.మీలో ఎవరు కోటీశ్వరుడు లేటెస్ట్ సీజన్ ని మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా కార్యక్రమానికి లేటెస్ట్ ప్రోమో విడుదల చేశారు. ‘హాట్ సీట్ లోకి ఎవరు రాబోతున్నారు.. నేను హాట్ సీట్.. వెయిటింగ్’ అంటూ సీరియస్ గా డైలాగ్ చెప్పిన చిరంజీవి.. అంతలోనే తమాయించుకుని.. సింపుల్ గా ‘వెయిటింగ్’ అంటూ మాడ్యులేషన్ మార్చి డైలాగ్ చెప్పి.. ‘ప్లీజ్ కమ్’ అంటూ ప్రోమోను ఫినిష్ చేశారు. ఒకే డైలాగ్ ను.. అందులోనూ ఖైదీ నంబర్ 150లో విపరీతంగా పేలిన డైలాగ్ ను.. మీలో ఎవరు కోటీశ్వరుడు కోసం చిరు ఉపయోగించిన తీరు అద్భుతహ అనాల్సిందే.

Comments