ప్రచురణ తేదీ : Tue, Feb 14th, 2017

‘ఎంఇకె’ తొలి ఎపిసోడ్‌కే ‘కోటి’ ప‌ట్టేశాడా?


మెగాస్టార్ హోస్ట్‌గా స్టార్ -మా `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు?` (ఎంఇకె) తొలి ఎపిసోడ్ దిగ్విజ‌యంగా లైవ్ అయ్యింది. ఈ షో ఆద్యంతం మెగాస్టార్ ఆక‌ట్టుకున్నారు. పార్టిసిపెంట్ అంతే నాలెజ్‌తో అల‌రించారు. మొద‌టి పార్టిసిపెంట్ సోమిరెడ్డి ఎంత‌కీ తెగ‌ని మేధావి. ఒక్కో ప్ర‌శ్న‌కు అంతే సింపుల్‌గా ఆన్స‌ర్స్ చేస్తూ షోని రక్తి క‌ట్టించారు. అయితే ఈ షో ఆద్యంతం అశేష ప్రేక్ష‌కాభిమానుల మెప్పు పొందేలా ర‌క్తి క‌ట్టించ‌డంలో ఒక హోస్ట్‌గా మెగాస్టార్ 200 శాతం స‌క్సెస‌య్యార‌న్న‌ది వీక్ష‌కుల మాట‌. ఇంత వైబ్రెంట్‌గా ఓ టీవీ షోని వీక్షించ‌డం అన్న‌ది ఇటీవ‌లి కాలంలో లేనేలేదు. అది మెగాస్టార్ మ‌హిహ‌. ఆయ‌న ఛ‌రిష్మా అలా నిల‌బెడుతుంది. కోటానుకోట్ల ప్రేక్ష‌కాభిమానుల్లో ఉద్వేగం నింపుతుంది. అంత పెద్ద స్టార్ అయినా చిరు ఎక్క‌డా ఆ ద‌ర్పం చూపించ‌రు. కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా స్వ‌యంకృషితో ఛాలెంజ్‌తో ఎదిగిన స్టార్‌గా ఆయ‌న అంతే ఒదిగి ఉంటారు. అలా ఉండ‌డ‌మే ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. హాట్‌సీట్‌కి ఎంపికైన వ్య‌క్తుల‌కు ముందే త‌ను స్నేహితుడు అయిపోతారు. ఎపిసోడ్‌కి ముందే ప‌క‌డ్భందీ నాలెజ్‌, ప్రిప‌రేష‌న్‌తో రెడీ అవుతారు. అడిగే ప్ర‌శ్న నేప‌థ్యం తెలియ‌నిదే మెగాస్టార్ ప్ర‌శ్న వేయ‌రు. దానిపై అమూలాగ్రం చ‌దివేయ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. అంటే అవ‌త‌లి వ్య‌క్తి ఐఏఎస్ రేంజు అయితే అందుకు త‌గ్గ‌ట్టే మెగాస్టార్ ప్రిపేరవుతారు. అదీ ఆయ‌న స్టైల్‌. ఐఏఎస్‌, ఐపీఎస్ ప్రిపేర‌య్యేవాళ్లే కాదు, ఆటో డ్రైవ‌ర్లు, సెల‌బ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారు.

మెగాస్టార్ హోస్ట్‌గా స్టార్ మాలో `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` సోమ‌, మంగ‌ళ‌, బుధ, గురు వారాల్లో రాత్రి 9.30కు ప్ర‌సారం అవుతోంది. తొలి ఎపిసోడ్‌తోనే షోని ఆద్యంతం ర‌క్తిక‌ట్టించిన మెగాస్టార్ అరుదైన ఫీట్ వేశారు. ఇంత‌వ‌ర‌కూ ఏ షోలోనూ మొద‌టి పార్టిసిపెంటే `కోటి` అందుకునే ప్ర‌శ్న వ‌ర‌కూ రావ‌డం అన్న‌ది లేనేలేదు. 15వ ప్ర‌శ్న వ‌ర‌కూ వ‌చ్చిందే లేదు. కానీ సోమిరెడ్డి వ‌చ్చారు. ఆయ‌న కోటి అందుకున్నారా? లేదా? మ‌ంగ‌ళ‌వారం `ఎంఇకె`లో చూడండి.

Comments