ప్రచురణ తేదీ : Dec 29, 2016 12:10 PM IST

కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ఛార్మి?

charmi
మంత్ర చిత్రంతో మ‌తుల్ సుతుల్ త‌ప్పేలా చేసింది ఛార్మి. అయితే ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించినా అవేవీ అంత కిక్కివ్వ‌లేదు. మంగ‌ళ‌, బుడ్డా హోగా తేరా బాప్‌, కావ్యాస్ డైరీ చిత్రాలు వ‌చ్చాయి. అటుపై జ్యోతిల‌క్ష్మిగా ఓ ఊపు ఊపాల‌ని ప్ర‌య‌త్నించినా క‌మ‌ర్షియ‌ల్గా వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ చిత్రంలో మ‌గాళ్ల‌ను ఆడుకునే వేశ్య‌గా రెబ‌ల్‌గా క‌నిపించి మెప్పించిన ఛార్మి ఆ త‌ర్వాత కూడా వేశ్య పాత్ర‌లో న‌టించి ఫెయిలైంది.

అయితే ఇటీవ‌లి కాలంలో పూరి కాంపౌండ్‌లో చేరి వివాదాల్లో వేలెట్టింది. దాంతో ఆ త‌ర్వాత క‌థానాయిక‌గా న‌టించిన దాఖ‌లాలు క‌నిపించ‌లేదు. ఛార్మి న‌టించిన మంత్ర‌-2 ఇప్ప‌టికీ పెండింగ్‌లోనే ఉంది. మ‌రి కొత్త సంవ‌త్స‌రంలో కొత్త‌గా వ‌చ్చేందుకు ఛార్మింగ్ బ్యూటీ ఏం ప్లాన్స్ వేస్తోందో చూడాలి.

Comments