ప్రచురణ తేదీ : Apr 14, 2018 12:08 PM IST

ఆ విషయంలో చరణ్ సేఫ్ అయ్యాడా ?

ఇప్పటికే రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో రామ్ చరణ్. ఆ సినిమా హిట్ తో పాటు అటు అవార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చరణ్ అంటే ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఏర్పడింది. రంగస్థలం తో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో మరో విషయంలో నిజంగా సేఫ్ అయ్యాడు ? ఏ విషయంలో అనుకుంటున్నారా .. నిన్న విడుదలైన కృష్ణార్జున యుద్ధం సినిమా విషయంలో ? అవును నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణార్జున యుద్ధం డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇకముంది కూడా పెద్దగా హిట్ అయ్యే పోలికలు కనిపించడం లేదు .. యావరేజ్ టాక్ తో మిగిలిపోయింది. ఈ కథను ముందు చరణ్ కు చెప్పాడట దర్శకుడు గాంధీ, కానీ ఎందుకో చరణ్ కు నచ్చకపోవడంతో నో చెప్పాడట .. దాంతో ఆ కథ నాని దగ్గరికి వెళ్ళింది. సో మొత్తానికి చరణ్ ఈ విషయంలో అలా లక్కీ అయ్యాడన్నమాట.

Comments