ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

చాలా చీప్ ఫుడ్..ఇదే చంద్రబాబు ఎనర్జీ సీక్రెట్..!

chandrababu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ఉత్సాహంగా, హుషారుగా కనిపిస్తారు. సభలు, సమావేశాలతో అనునిత్యం బిజీగా గడుపుతున్నా ఆయనలో అలసట కనిపించదు.కాగా నేడు చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించారు.నెల్లూరులోని చెన్నూరు లో జన్మభూమి – మావూరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు తన ఆహార నియమావళిని ప్రజలకు వివరించారు. కేవలం డబ్బు ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉండలేమని ఆయన ఆన్నారు.

తాను తీసుకునే ఆహారం చెన్నూరులో కూడా దొరుకుందని చంద్రబాబు అన్నారు. తాను తక్కువ ఖర్చుతో మంచి ఆహారాన్ని తీసుకుంటానని ప్రజలకు వివరించారు. తాను ప్రతిరోజు ఉదయం రాగి, సజ్జ , జొన్న ఇలా రోజుకోరకం ఉడికించుకుని తింటానని అన్నారు. ఆ తరువాత రెండు ఉడకబెట్టిన కోడి గుడ్లు ( పచ్చ సోన తీసేసి) తీసుకుంటానని అన్నారు.మధ్యాహ్న భోజనానికి ముంద ఏదో ఒక పండు తీసుకుంటానకి అన్నారు.రెండు రకాల కూరగాయలు, పెరుగుతో భోజనం చేస్తానని ఆయన అన్నారు. చేపల్ని తింటే మంచిందని చెప్పడంతో ఈమధ్య నుంచి వాటిని కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. రాత్రి భోజనం తరువాత పడుకోబోయో ముందు గ్లాసు పాలు తీసుకుంటానని అన్నారు. తాను ప్రతి రోజు తీసుకునే ఆహరం ఇదే అని అన్నారు. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదని చంద్రబాబు అన్నారు.

Comments