ప్రచురణ తేదీ : Dec 28, 2016 2:56 PM IST

పాతనోట్లను డిపాజిట్ చేసుకోవడానికి మరో 50 రోజులు గడువు ఇవ్వబోతున్నారా?

money
పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నపుడు మోడీ పాతనోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవడానికి డిసెంబర్ 30 వరకు సమయం ఇచ్చారు. ఆ తరువాత పాతనోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవాలంటే ఆర్బీఐ కార్యలయాలలో కేవైసి ఇచ్చి డిపాజిట్ చేసుకోవాలనే నిబంధన పెట్టింది. అయితే ప్రస్తుత పరిస్థితులను పరిగణన లోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 30 వరకు ఇచ్చిన గడువును మరొక 50 రోజుల పాటు పొడిగించాలనుకుంటుందని సమాచారం.

మోడీ పెద్దనోట్లను రద్దు చేసిన తరువాత దేశ ప్రజలను తనకు 50 రోజుల సమయం ఇవ్వమని, ఆ తరువాత ఎలాంటి కష్టాలు ఉండవని మోడీ హామీ ఇచ్చారు. అయితే ఆయన కోరిన 50 రోజులగడువు నేటితో ముగిసింది. అయినా ఇంత వరకు చాలా చోట్ల ఏటీఎంలు పని చేయడం లేదు. ప్రజలకు సరిపడా నగదు కూడా అందుబాటులో లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని కేంద్రం అనుకుంటుంది. అందుకే ఈ గడువును మరొక 50 రోజులు పొడిగించాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

Comments