ప్రచురణ తేదీ : Tue, Feb 28th, 2017

బూతు వీడియో లు ఆపడం మా వలన కాదు – చేతులు ఎత్తేసిన కేంద్రం


లైంగికంగా జరిగే హింస కి సంబంధించి కానీ , మరే బూతు వీడియో లకి సంబంధించి కానీ వాటిన్ నిలువరించే సామర్ధ్యం మా దగ్గర లేదు అంటూ సుప్రీం కోర్టు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అలాంటి వీడియోలు అప్ లోడ్ కాకుండా చేసే యంత్రాంగం తమ వద్ద లేదని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఎదుట తన నిస్సహాయతను ఒప్పుకుంది. అశ్లీల వీడియోలు ఇంటర్నెట్ లో అప్ లోడ్ కాకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు నిన్న విచారించింది. ఈ పిటిషన్ ను జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ యూయూ లలితలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ… అలాంటి వీడియోలను అప్ లోడ్ చేయడాన్ని నియంత్రించలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.

Comments