ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

కాజల్ కోసం .. కేథరిన్ ని తప్పించారుగా ?

గ్లామర్ భామ కేథరిన్ ట్రెసా ఈ మధ్య మంచి జోరుమీదుంది అని అనుకునేలోగా ఆమె చేతిలోకి వచ్చిన సినిమాలు అలా అలా చే జారిపోతున్నాయి. సరైనోడు తరువాత మంచి అవకాశాలను పట్టేస్తున్న ఈ భామ తాజాగా రానా సరసన నేనే రాజు నేనే మంత్రి లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది. తమిళ సూపర్ హిట్ బోగన్ కు రీమేక్ గా తెలుగులో రూపొందే ఈ సినిమాలో మొదట కేథరిన్ ను ఎంపిక చేసాడు .. కానీ మధ్యలో ఏమైందో ఏమో గాని .. ఇప్పుడు ఆమె ప్లేస్ లో గ్లామర్ భామ కాజల్ ను దింపుతున్నారు. దానికి ప్రత్యేక కారణాలు మాత్రం తెలియరావాడం లేదు. క్రేజీ అవకాశాన్ని అందుకున్నా అని ఆనందంలో ఉన్న కేథరిన్ కు మరోసారి నిరాశే మిగిలింది.

Comments