ప్రచురణ తేదీ : Sep 26, 2017 9:32 PM IST

యువతిని అలా చేసి వాట్సాప్ లో పెట్టిన బిటెక్ బాబు !

ప్రకాశం జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడిన బీటెక్ విద్యార్థి ఆ దృశ్యాలని సామజిక మాధ్యమం వాట్సాప్ లో పోస్ట్ చేశాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లాలోని కనిగిరి చెందిన విద్యార్థులు విహారయాత్ర కొరకు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. ముగ్గురు యువకులతో కలసి ఇద్దరు యువతులు ఓ ప్రాంతానికి వెళ్లారు.

అక్కడ ఇద్దరు యువతుల బట్టలని బలవంతగా తొలగించే ప్రయత్నం చేశారు. ఓ యువతి తప్పించుకుని పారిపోగా మరో యువతిమాత్రం వారి చేతుల్లో చిక్కింది. ఆ యువతిని వివస్త్రని చేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె పోలీస్ లని ఆశ్రయించింది. యువతిపై బిటెక్ విద్యార్థి అత్యాచారానికి ప్రయత్నించగా మరో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు అతడికి సహకరించినట్లు పోలీస్ లు తెలిపారు.

Comments