ప్రచురణ తేదీ : Dec 3, 2017 8:22 PM IST

బ్రూస్‌లీ బ‌యోపిక్ .. తాజా అప్‌డేట్‌

భార‌తీయ సినిమాల‌కు చైనాలోనూ భారీ మార్కెట్ ఉంద‌ని నిరూపించింది `దంగ‌ల్‌`. బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్లు చైనా నుంచే వ‌సూలు చేసింది. అందుకే ఆ సినిమా ఇన్‌స్పిరేష‌న్‌తో చైనా మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ ప‌లు చిత్రాలు తెర‌కెక్కుతున్నాయి. ద‌క్షిణాది క్రేజీ మూవీ `2.ఓ` సైతం చైనా మార్కెట్‌ని పెద్ద రేంజులోనే టార్గెట్ చేస్తోంది. చైనాలో ఈ సినిమాని రికార్డ్ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేందుకు శంక‌ర్ బృందం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇక ఇదే ఒర‌వ‌డిలో మ‌రో భారీ చిత్రాన్ని రూపొందించేందుకు సీనియ‌ర్ ఫిలింమేక‌ర్ శేఖ‌ర్ క‌పూర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. చైనాతో అనుబంధం ఉన్న క‌థాంశాన్నే అందుకు ఎన్నుకుంటున్నాడు. ప్ర‌ఖ్యాత మార్ష‌ల్ ఆర్ట్స్ స్పెష‌లిస్ట్‌.. చైనీ- అమెరిక‌న్ స్టార్ బ్రూస్‌లీ జీవిత‌క‌థ ఆధారంగా ఓ సినిమాని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. `లిటిల్ డ్రాగ‌న్` అనేది టైటిల్. బ్రూస్‌లీ హాంకాంగ్ వెళ్లి హీరో కాక‌ముందు, బాల్యం, యుక్త‌వ‌య‌సులో మార్స‌ల్ ఆర్ట్స్ కింగ్ అనిపించుకునేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నాలు సాగించాడు? అన్న పాయింట్‌తో ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సినిమాకి బ్రూస్‌లీ త‌న‌య షానోన్ లీ స్క్రిప్టు సిద్ధం చేయ‌డం విశేషం. బ్రూస్‌లీ సినిమా అన‌గానే అమెరికా, చైనాకి చెందిన ప‌లు స్టూడియోలు కో- ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నాయ‌ని శేఖ‌ర్ క‌పూర్ తెలిపారు. ప్ర‌స్తుతం 28వ సింగ‌పూర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింఫెస్టివ‌ల్‌లో జ‌డ్జిగా కొన‌సాగుతున్న శేఖ‌ర్ క‌పూర్ ఈ విష‌యాల్ని వెల్ల‌డించారు.

Comments