ప్రచురణ తేదీ : Jan 30, 2017 6:02 PM IST

పేస్ బుక్ లో పోస్ట్ చేసి మరీ ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు !

susaide
తన ప్రియురాలు తనతో మాట్లాడడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక లోని దావణగెరె లో జరిగింది. తాను ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు ఓ వీడియో ని పేస్ బుక్ లో పోస్ట్ చేసి మరీ ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రవీణ్ ఉప్పార్ (22) మరియు అతని మేనమామ కూతురు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

గత కొన్ని రోజులుగా ప్రవీణ్ తో తన ప్రేయసి సరిగా మాట్లాడడం లేదు. ఫోన్ చేస్తే ఫోన్ కు కూడా స్పందించడం లేదు. దీనితో మనస్తాపానికి గురైన ప్రవీణ్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియో రికార్డ్ చేసి దానిని పేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అనంతరం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ప్రేయసి తనని మోసం చేసిందని, చట్ట ప్రకారం తనని శిక్షించాలని ఆ వీడియో లో కోరాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అందుకు తన కుటుంబసభ్యులు క్షమించాలని కోరాడు. తన ఇంటిలోనే ఉరి వేసుకున్న ప్రవీణ్ మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీస్ లు విచారణ చేస్తున్నారు.

Comments