ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

కుక్క కోసం ఆత్మహత్య చేసుకున్న యువకుడు

dogs
ఒకవైపు కొంతమంది మెడికోలు ఒక కుక్కను మూడు అంతస్థుల నుండి కింద పడేసి అది బాధ పడుతుంటే చూసి ఆనందించిన యువకులను మనం చూసాం. మరొకవైపు కొంతమంది కుర్రాళ్ళు చిన్న చిన్న కుక్క పిల్లలను బ్రతికుండగానే మంటల్లో పడేసి సజీవదహనం చేసిన సంఘటనలను చూసాం. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఒక యువకుడు తన పెంపుడు కుక్కను ఎంతో ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు. అయితే ఆ కుక్క అకస్మాత్తుగా చనిపోవడంతో తట్టుకోలేని ఆ యువకుడు తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఛత్తీస్ ఘడ్ కు చెందిన హర్షవర్ధన్ రాఘవ్ పూణే లో మేనేజ్మెంట్ విద్యను అభ్యసిస్తున్నాడు. రాఘవ్ సోమవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో తాను నివసిస్తున్న ప్లాట్ లోని ఆరవ ఫ్లోర్ నుండి దూకేసాడు. దాంతో తీవ్ర తలకు తీవ్ర రక్త స్రావమైంది. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆటను చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. తాను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్క ఎనిమిది నెలల క్రితం చనిపోయిందని, ఆ బాధ తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అతను లేఖలో రాసాడు. తల్లి తండ్రులు తనను క్షమించాలని, తన చావుకు ఎవరూ కారణం కాదని ఆ లేఖలో పేర్కొన్నాడు. పోలీసులు రాఘవ్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Comments