ప్రచురణ తేదీ : Sep 26, 2017 2:12 PM IST

సినిమాకి – క్రికెట్ కి భలే సంబంధం! బయోపిక్ ట్రెండ్ షురూ!


సినిమా అంటే ఒక వ్యక్తి జీవితంలో జరిగే కథ. ఆ కథలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. ఆ భావోద్వేగాలు అన్ని కలిస్తే మంచి కథ అవుతుంది. ఆ కథని దృశ్య రూపంలో తీసుకొస్తే మంచి సినిమా అవుతుంది. ఆ కథలో దమ్ముంటే సినిమా హిట్ అవుతుంది. ఈ ఫార్ములా ఎందుకో కొత్తగా ఉంది. అందుకే బాలీవుడ్ దర్శక, నిర్మాతలు కథల కోసం కష్టపడకుండా బయోపిక్ ల మీద ద్రుష్టి పెట్టారు. ఒకప్పుడు హాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడిచేది. దానిని మన ఇండియన్స్ స్ఫూర్తిగా తీసుకొని, ఇక్కడి ప్రముఖుల బయోపిక్ లు తీయడం మొదలు పెట్టారు. అయితే గతంలో ఎప్పుడో ఒకటి, అర బయోపిక్ కథలు బాలీవుడ్ స్క్రీన్ మీద వచ్చేవి, అయితే డర్టీ పిక్చర్ సినిమా తర్వాత బయోపిక్ లకి మంచి డిమాండ్ ఉందని తెలుసుకున్న బీ-టౌన్ నిర్మాతలు ఇక ఇండియాలో ఎవరి కథల మీద ద్రుష్టి పెడితే బాగుంటుంది అనే విషయాన్ని చూసుకుంటే. వెంటనే వారికి క్రికెట్ గుర్తుకొచ్చింది. మొదటి నుంచి ఇండియాలో క్రికెట్ కి, సినిమాకి మంచి అనుబంధం ఉంది. సెలబ్రిటీ జీవితాల్లో ఉండే వారు, డేటింగ్, మీటింగ్,, ఎంగేజింగ్ తో ఒకటైన సందర్భాలు, కథలు చాలా ఉన్నాయి. దీంతో క్రికెటర్ జీవిత కథలు మంచి ఇంటరెస్టింగ్ గా ఉంటాయని బాలీవుడ్ నిర్మాతలు భావిచారు.

ఇంకేముంది ధోని సినిమాతో బాలీవుడ్ లో మొదటి క్రికెటర్ జీవిత కథ సినిమాగా తీయడం స్టార్ట్ చేసారు. అది అదిరిపోయే కలెక్షన్స్ ని నిర్మాతలకి తెచ్చిపెట్టింది. తరువాత సచిన్ కథ స్క్రీన్ మీదకి వచ్చింది, అంతకంటే ముందుగానే అజారుద్దీన్ జీవితకథ, అజహార్ పేరుతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆ సినిమా అంతగా మెప్పించాలేకపోయిన, మన ఆటగాళ్ళ బయోపిక్ లకి మంచి డిమాండ్ అయితే ఉందని అర్ధమైంది. ఇంకేముంది ఈ బయోపిక్ లని విస్తరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు బాలీవుడ్ ముగ్గురు క్రికెట్ ఆటగాళ్ళ బయోపిక్ లకి రంగం సిద్ధం అయ్యింది. వాటిలో ఒకటి కపిల్ దేవ్, దీనిలో రణవీర్ సింగ్ హీరోగా ఫైనల్ అయినట్లు సమాచారం. ఇక తాగా విమెన్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ కోసం వయోకామ్ 18 అనే ప్రొడక్షన్ కంపెనీ స్టొరీ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తాజాగా ప్రకటించింది. దీనికి త్వరలోనే రంగం సిద్ధం అవుతుందని కూడా సదరు సంస్థ చెప్పింది. ఇదే టైంలో విమెన్ ఫాస్ట్ బౌలర్ జులన్ గో స్వామీ జీవిత కథని కూడా సినిమాగా తెరకెక్కించేందుకు ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీ రెడీ అయినట్లు తెలుస్తుంది.

అయితే కేవలం క్రికెట్ ఆటగాళ్ళ జీవిత కథలు మాత్రమె కాకుండా పుల్లెల గోపిచంద్, సైనా నెహ్వాల్, పి.వి.సింధూ వంటి బ్యాడ్మింటన్ క్రీడాకారులు, మరో వైపు ఇండియన్ డబ్యూ.డబ్యూ ఎఫ్ ఫైటర్ గ్రేట్ కలి బయోపిక్ కూడా బాలీవుడ్ లో రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. మరో వైపు తమిళనాడు కి చెందిన క్రీడాకారుడు కథ రెడీ అవుతుంది. ఇంకా దర్శక, నిర్మాతలు క్రీడాకారులతో పాటు, సోషల్ యక్టివిటిస్ట్ ల కథలు కూడా స్క్రీన్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు బాలీవుడ్ లో బయోపిక్ ట్రెండ్ నడుస్తుందని దీనిని బట్టి అర్ధమవుతుంది.

Comments