ప్రచురణ తేదీ : Jan 27, 2017 10:20 AM IST

త్రిష మాజీ ప్రియుడితో తెలుగు భామ ఎఫైర్ ?

varuni
వరుణ్ మణియన్ .. ఏంటి ఈ పేరు ఎక్కడో విన్నట్టుందికదా .. అవును ఆ మధ్య గ్లామర్ భామ త్రిష పెళ్లి చేసుకుంటుందంటూ నానా హంగామాతో ఫామ్ లోకి వచ్చాడు వరుణ్. కోలీవుడ్ లో నిర్మాతగా కూడా ఉన్న ఆయనకు త్రిష లవర్ గానే ఎక్కువ ఫాలోయింగ్ దక్కింది. నిశ్చితార్థం కూడా జరిగి పెళ్ళికి దగ్గర పడుతున్న సమయంలో ఎందుకనో ఈ పెళ్లి జరగలేదు. దాంతో ఇద్దరు విడిపోయారు. ఇక త్రిష మాత్రం తన సినిమాలపై సీరియస్ గా దృష్టి పెట్టింది. అయితే వరుణ్ ఆ తరువాత ఎక్కడ కనిపించలేదు… కానీ లేటెస్ట్ గా తెలుగు భామ బిందు మాధవి తో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అయితే త్రిష మాజీ లవర్ ని తన ప్రేమలోకి దించిందని, వీరిద్దరూ జోరుగా ఎంజాయ్ చేస్తున్నారని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుణ్ మణియన్ ప్రేమాయణం బిందు మాధవి లాంటి చిన్న హీరోయిన్ తో సాగిస్తున్నాడని, బిందు కు కూడా పెద్దగా సినిమా అవకాశాలు లేవు కాబట్టి అతనితో సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అయినట్టుంది అని అంటున్నారు సినీ జనాలు? మరి వీరి వ్యవహారం ఎన్నాళ్ళు సాగుతుందో చూడాలి!!

Comments