ప్రచురణ తేదీ : Jun 15, 2018 10:22 AM IST

బిగ్ బి తనకు బిగ్ హార్ట్ ఉందని నిరూపించుకున్నారు!

మన టాలీవుడ్ స్టార్లలో దాదాపు చాలా మంది పేదలకు, అలానే ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు ప్రజలకు తమ వంతు సాయమందించేందుకు ముందుకు వస్తుంటారు. మరికొందరైతే గుప్తదానాలు చేస్తూ తమ పేరు బయటకి రానివ్వకుండా చేసేవారు వున్నారు. అలానే బాలీవుడ్ స్టార్లలో బిగ్ బి అమితాబ్ కూడా ఎప్పుడు తనవంతుగా సాయం అందించేందుకు ముందుంటారు. కాగా ఇటీవల ఆయన దేశంకోసం యుద్ధభూమిలో పోరాడి ప్రాణాలు అర్పించిన ఇద్దరు సైనికాధికారుల కుటుంబాలకు తన వంతుగా రూ. 2 కోట్లవరకు ఆర్ధిక సాయం చేసేందుకు వచ్చారు. ఇక దేశానికి వెన్నెముక అయిన అన్నదాతను ఆదుకోవడం కూడా మన బాధ్యతేనని, వారికి కూడా తనవంతుగా త్వరలో సాయాన్ని ప్రకటిస్తానని అమితాబ్ సోషల్ మీడియా వేదికా తెలిపారు. అయితే ఈ సాయాన్ని ఆయన నమ్మకస్తులైన బృందాలను, స్వచ్చంద సంస్థలను ఏర్పాటు చేసి వారిద్వారా అందించనున్నట్లు సమాచారం. దయార్ద్ర హృదయంతో తనవంతు ఆర్ధిక సాయంపైకి ముందుకు వచ్చిన అమితాబ్ ను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు…….

Comments