ప్రచురణ తేదీ : Jun 5, 2018 1:50 AM IST

జోరుమీదున్న శైలజా రెడ్డి అల్లుడు ?


స్లో అండ్ స్టడీ గా సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్న నాగ చైతన్య తాజాగా నటిస్తున్న చిత్రం శైలజ రెడ్డి అల్లుడు. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు .. అందులో బాబీ దర్శకత్వంలో వెంకటేష్ తో కలిసి మల్టి స్టారర్ చేస్తున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బిజినెస్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన సాటిలైట్ హక్కులు, హిందీ డబ్బింగ్ రైట్స్ కలిపి 14 కోట్లకు అమ్ముడైందట. ఇది నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్. సినిమాకు సంబందించిన టీజర్ కూడా విడుదల కాకముందే ఈ రేంజ్ లో భారీ డీల్ కుదరడం విశేషం. మొత్తానికి శైలజ రెడ్డి అల్లుడిపై అటు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ నెలకొంది.

Comments